TSPSC: టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. టీఎస్‌పీఎస్‌సీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. By Shiva.K 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్‌సి ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీమ్ కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. Also Read: టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్.. అలాంటి వ్యక్తి సీపీగా.. సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం.. #cm-revanth-reddy #tspcs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి