CM Revanth Reddy: తెలంగాణలో కొత్త పథకం.. వారికి రూ.1,00,000!

TG: ఈరోజు ప్రజాభవన్‌లో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.

CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!
New Update

CM Revanth Reddy: తెలంగాణలో రేవంత్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు ప్రజాభవన్‌లో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారికి ఆర్థిక సాయం అందిచేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది.

సీఎం రేవంత్ సంచలన ప్రకటన...

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన రాష్ట్ర అభ్యర్థుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30వేల ఉద్యోగాలు భారీ చేస్తామని అన్నారు. UPSC తరహాలో TGPSCలో మార్పులు చేపట్టామని చెప్పారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగుల వల్లే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందని.. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసు అని అన్నారు. నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు.







#revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe