CM Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన సాగనుంది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. By Nikhil 04 Aug 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. కీలకమైన న్యూయర్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నానని రేవంత్ అన్నారు. అమెరికా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..@revanth_anumula @INCTelangana #Telangana #CM #revanthreddy #USA #RTV pic.twitter.com/ib0AERs9a6 — RTV (@RTVnewsnetwork) August 4, 2024 ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో స్వాగతం పలకడానికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న 10 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశాలు, చర్చలు జరపనున్నారు. సీఎం వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు ఉన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి