Telangana: ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ ధర్నా.. ఎందుకంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శుక్రవారం నాడు ధర్నాకు దిగనున్నారు. ఇందిరాపార్క్ వద్ద రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నారు.

New Update
Telangana: ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ ధర్నా.. ఎందుకంటే..

CM Revanth Reddy Protest: శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేపట్టనున్నారు. అయితే, ధర్నా ఎందుకు అనేగా మీ సందేహం.. ఆ విషయం తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

పార్లమెంట్‌లోకి చొరబడిన దుండగులు స్మోక్‌ బాంబ్స్‌ను వదిలిన విషయం తెలిసిందే. అయితే, అవి కలర్ స్మోక్స్ మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా వారు ఉగ్రవాదులు అయితే పరిస్థితి ఏంటి? అనేది అందరిలోనూ భయం కలిగించింది. అయితే, పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలపై ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ, ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పకపోగా.. దాదాపు 150 మందికిపైగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ నేతృత్వంలోనే శుక్రవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై ప్రభుత్వం స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.

Also Read:

దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..

విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

Advertisment
తాజా కథనాలు