ప్రధానికి ఏం కోరామంటే: రేవంత్ ప్రెస్ మీట్-LIVE

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు.

New Update
ప్రధానికి ఏం కోరామంటే: రేవంత్ ప్రెస్ మీట్-LIVE

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానితో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరామన్నారు. ఇంకా.. రాష్ట్రానికి IIM ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామన్నారు. ఇంకా ఐటీఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అడిగామన్నారు.

ఇంకా.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఇంకా భద్రాచలం సమీపంలో ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరినట్లు చెప్పారు. ఇంకా 29 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించాల్సి ఉందని ప్రధానికి తెలిపామన్నారు. ఈ కేటాయింపు త్వరలో పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు మోదీ.

Advertisment
తాజా కథనాలు