Rythu Bandhu: రైతు బంధుపై సీఎం కీలక ఆదేశాలు.. రుణమాఫీ కూడా.. ఎప్పటి నుంచో తెలుసా!

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను నేటి నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

New Update
Rythu Bandhu: రైతు బంధుపై సీఎం కీలక ఆదేశాలు.. రుణమాఫీ కూడా.. ఎప్పటి నుంచో తెలుసా!

Rythu Bandhu: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను నేటి నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సోమవారం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసాకు ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో గతంలో మాదిరిగానే ప్రస్తుతానికి రైతులకు చెల్లింపులు చేయాలని సీఎం సూచించారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం సూచించారు.

ఇది కూడా చదవండి: ‘ఫ్యాన్’ ఊగిసలాట.. 24 గంటల్లో ఇంత జరిగిందా!.. వైసీపీలో ప్రకంపనలు

రూ. 2లక్షల వరకూ రుణమాఫీపై కార్యాచరణ
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ కోసం తగిన కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి
ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బారును ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. ఇకనుంచి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 10గంటల్లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ప్రజావాణిలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు