CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త!

ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

New Update
CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రైతుబంధు, పింఛన్లకు సంబంధించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం సాగడంతో ఆయా లబ్ధిదారులు ఆందోళన వ్యక్తమైంది. అనేక మంది ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కార్యాలయాలకు రావడంతో గందగగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (TS CM Revanth Reddy) అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు లబ్ధిదారులు గురి కావద్దన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఈ పథకాల కింద లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులను కొన్ని చోట్లు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కావాల్సినన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు రేవంత్ రెడ్డి.

Advertisment
Advertisment
తాజా కథనాలు