/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-29-at-1.59.52-PM.jpeg)
New State Emblem Of Telangana: తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది.
కాగా మరోవైపు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం మారిందని.. కొత్త చిహ్నం ఇదే అంటూ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికి వరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక రాష్ట్ర చిహ్నాన్ని విడుదల చేయలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త రాష్ట్ర చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం మార్చబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నమూనాలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Zh616tU0rt
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2024