CM Revanth Reddy: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికల స్టంట్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుంటే తండ్రిగా కేసీఆర్ కూతురు ఇంటికి రావాలి కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ గురించి మాట్లాడడం లేదని.. వారిద్దరూ ఒకటేనని కామెంట్స్ చేశారు. సానుబూతి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ పాకులాడుతున్నాయని విమర్శలు గుప్పించారు. పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్ట్ ను కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?
కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు నాటకం ఆడుతున్నాయన్నారు. తమ కుటుంబంలోని గందరగోళంను హరీష్ రావు పరోక్షంగా చెప్తున్నారన్నారు. మమ్మల్ని మా పని చేసుకోనిస్తే..ప్రతిపక్ష్యాన్ని.. వాళ్లా పని చేసుకోనిస్తామని హెచ్చరించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..!
మా దగ్గర వ్యూహం ఉందని.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదురుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. నల్లగొండ సభలో నన్ను విమర్శించిన విషయం మర్చిపోయారా అని అన్నారు. భాష గురించి కేసీఆర్ కు ఇప్పుడైనా గుర్తుకు రావడం మంచిదేనని కామెంట్స్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మా ప్రభుత్వం కు రెఫరెండమన్నారు.