Breaking :హెటిరోకు రేవంత్ సర్కార్ షాక్.. ఆ జీవో రద్దు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో పార్థసారధికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములకు సంబంధించిన జీవోను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల ఆధారంగా జీవో 140ని నిలిపివేస్తూ రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Breaking :హెటిరోకు రేవంత్ సర్కార్ షాక్.. ఆ జీవో రద్దు

Hetero: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో (Hetero Parthasaradhi) పార్థసారధికి గత ప్రభుత్వం కేటాయించిన భూములపై జీవోను రద్దు చేసింది. ఈ మేరకు సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్ ఆస్పత్రుల కోసం 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

30 ఏళ్ల పాటు లీజు..
ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో పదిహేను ఎకరాల భూమిని 30 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ కేసీఆర్ (kcr) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ భూముల విలువ వందల కోట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాల ఆధారంగా జీవో 140ని నిలిపివేస్తూ రేవంత్  (CM Revanth)సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి : Medchal: వాళ్లంతా ఆయన మోచేతి నీళ్లు తాగి పైకొచ్చారు.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

అప్పనంగా పంచి పెట్టారు..
విలువైన భూములను అప్పనంగా పంచి పెట్టారని, తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కొంతమందికి తక్కువ మొత్తానికి లీజుకు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత జీవోను నిలిపేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు