Tirupati Reddy: తెలంగాణలో హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తన ఇల్లు FTL పరిధిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి హైడ్రా అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా తిరుపతిరెడ్డి స్పందించారు.
Also Read: వైసీపీ మునిగిపోయే నావ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
తన ఇల్లు ఇల్లీగల్‌గా ఉంటే కూల్చివేయండని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదా టైమ్ ఇస్తే సామగ్రి తీసుకొని తానే బయటకెళ్తానన్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారని.. అయితే, ఇప్పటివరకు తనను ఏ అధికారి కలువలేదని తిరుపతిరెడ్డి అన్నారు.
2016-17లో అమర్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే, ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం తెలియదన్నారు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని వాల్ట యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు.1995లోనే ఈ లే ఔట్‌కు పర్మిషన్ వచ్చిందని.. ఈ విషయంపై బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని తిరుపతిరెడ్డి వ్యాఖ్యానించారు.