TG: నా ఇల్లును కూల్చివేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తన ఇల్లు ఇల్లీగల్‌గా ఉంటే కూల్చివేయండని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదా టైమ్ ఇస్తే సామగ్రి తీసుకొని తానే బయటకెళ్తానని ఆయన అన్నారు. ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదన్నారు.

New Update
TG: నా ఇల్లును కూల్చివేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Tirupati Reddy: తెలంగాణలో హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తన ఇల్లు FTL పరిధిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి హైడ్రా అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా తిరుపతిరెడ్డి స్పందించారు.

Also Read: వైసీపీ మునిగిపోయే నావ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

తన ఇల్లు ఇల్లీగల్‌గా ఉంటే కూల్చివేయండని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదా టైమ్ ఇస్తే సామగ్రి తీసుకొని తానే బయటకెళ్తానన్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారని.. అయితే, ఇప్పటివరకు తనను ఏ అధికారి కలువలేదని తిరుపతిరెడ్డి అన్నారు.

2016-17లో అమర్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే, ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం  తెలియదన్నారు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని వాల్ట యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు.1995లోనే ఈ లే ఔట్‌కు పర్మిషన్ వచ్చిందని.. ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని తిరుపతిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు