BREAKING: RTV ప్రతినిధిపై సీఎం రేవంత్ సోదరుడి అనుచరుల దాడి.. ఖండిస్తున్న నేతలు!

TG: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి అనుచరులు RTV ప్రతినిధిపై దాడికి దిగారు. ఆయన నివాసం FTL పరిధిలో ఉందని అధికారులు నోటీసులు ఇవ్వడంతో.. కవరేజ్ చేయడానికి వెళ్లిన RTV మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిని మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు నేతలు ఖండించారు.

New Update
BREAKING: RTV ప్రతినిధిపై సీఎం రేవంత్ సోదరుడి అనుచరుల దాడి.. ఖండిస్తున్న నేతలు!

Tirupathi Reddy: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి GHMC అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో FTL పరిధిలో ఉన్న తిరుపతి రెడ్డి నివాసాన్ని చూపించేందుకు వెళ్లిన ఆర్టీవీ మహిళా జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్ పై తిరుపతి రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఆయన నివాసాన్ని చిత్రీకరించేందుకు అనుమతులు లేవని అడ్డుకున్నారు. ఆయన నివాసాన్ని చూపించేందుకు ప్రయతించిన వీడియో జర్నలిస్ట్ కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. వీడియో తీసేందుకు పర్మిషన్ ఎందుకు అని ఆర్టీవీ ప్రతినిధి అడగ్గా.. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది.

RTV ప్రతినిధిపై దాడి.. వెల్లువెత్తుతున్న విమర్శలు..

RTV ప్రతినిధిపై తిరుపతి రెడ్డి అనుచరుల దాడిని పలువురు నేతలు ఖండించారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఈ దాడిని ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అంటే మహిళా జర్నలిస్టులపై దాడి చేయడమే నా? అని ఆయన నిలదీశారు. ఆయన ట్విట్టర్ (X)లో.."విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది. మొన్న సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన మరువకముందే.. నేడు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటివద్ద మరో మహిళా జర్నలిస్టుకు అవమానం జరిగింది. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, మీడియా స్వేచ్చను హరించడం సిగ్గుచేటు. మీడియా పై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం." అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు