Musi River: మూసీ నది ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి!

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

New Update
Musi River: మూసీ నది ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి!

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. అలాగే జంట జలాశయాలకు గోదావ‌రి జలాల తరలింపునకూ నిధులివ్వాలంటూ కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు.

మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు..
ఈ సందర్భంగా కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు. రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

ఇది కూడా చదవండి: CM Revanth: కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. ఆ బ‌కాయిలపై కీలక చర్చ!

జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు.

Advertisment
తాజా కథనాలు