CM Revanth Reddy: కోదండరాంకు ఆ కీలక బాధ్యతలు.. సోనియాతో భేటీ తర్వాత రేవంత్ ప్రకటన

ఈ రోజు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యమకారులందరిని గౌరవించుకుంటామన్నారు. ఉద్యమకారుల జాబితాను తయారు చేసే బాధ్యత కోదండరాంకు అప్పగించినట్లు చెప్పారు.

CM Revanth Reddy: కోదండరాంకు ఆ కీలక బాధ్యతలు.. సోనియాతో భేటీ తర్వాత రేవంత్ ప్రకటన
New Update

CM Revanth Reddy Meeting With Sonia Gandhi: తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకలకు సోనియాను ఆయన ఆహ్వానించారు. కేబినెట్ విస్తరణ, తాజా రాజకీయ పరిస్థితులపై సోనియాతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు (Telangana Formation Day) సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు. ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు సోనియా అంగీకరించారని వెల్లడించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీకి పాకిస్థాన్ గుర్తొస్తుందన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తుంటే మోదీకి పాకిస్థాన్ గుర్తొస్తుందని ఫైర్ అయ్యారు. మోదీ తన పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టు దేశ ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు.

జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీకి ఏదో తేడా కొడుతోందని.. అందుకే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యమకారులందరిని గౌరవించుకుంటామన్నారు. ఉద్యమకారుల జాబితాను తయారు చేసే బాధ్యత కోదండరాంకు (Prof Kodandaram) అప్పగించినట్లు చెప్పారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe