Balka Suman: బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనాలను ఆకట్టుకునేందుకు నేతలందరూ ప్రచార బరిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది నేతలు మాటలు జారుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.

Balka Suman: బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్
New Update

CM KCR Warns Balka Suman: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనాలను ఆకట్టుకునేందుకు నేతలందరూ ప్రచార బరిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది నేతలు మాటలు జారుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ఏకంగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నూరు టికెట్ మళ్లీ తనకే ఇవ్వడంతో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో సుమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కాంగ్రెస్ వాళ్లను ఏమనొద్దని.. ఊళ్లల్లో అక్కడక్కడ తిరుగుతుంటారు, తిరగనివ్వండి.. ఎన్నికలు అవ్వగానే వాళ్లు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తారన్నారు. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్‌లోకి వచ్చారని.. మిగతా వాళ్లు కూడా వస్తారని.. అందరూ మనోళ్లేనంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తాము చెబుతుందో నిజమైందని.. బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఒక్కటేనని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ బీఆర్ఎస్ కోవర్టులన్నారని గతంలో ఈటల రాజేందర్ (Etela Rajender) లాంటి నేతలు పలు సందర్భాల్లో వాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల్లో జరిగే అంతర్గత విషయాలను ప్రగతిభవన్‌కు చేరవేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేకిత్తిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారని.. అందులో భాగంగానే సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో దిద్దుబాటు చర్యలకు సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అనవసరంగా బీజేపీకి అస్త్రం ఇచ్చినట్టు అయ్యిందంటూ BRS నేతలే విమర్శలు చేస్తున్నారు.

కాగా 2014లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీచేసిన సుమన్ ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 2018లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ చెన్నూరు నుంచి మరోసారి పోటీ చేయనున్నారు.

Also Read: పద్ధతి మార్చుకున్నారా సరే లేకపోతే కాల్చి పారేస్తా : మర్రి సీరియస్ కామెంట్స్

#cm-kcr #balka-suman #cm-kcr-warns-balka-suman #trs-mla-balka-suman #mla-balka-suman #cm-kcr-warning-to-balka-suman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe