Telangana: పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పేదల అభ్యున్నతి కోసం మరిన్ని పథకాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. పేదలు, రైతుల బతులను మార్చడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని, వారిపై చూపే ప్రేమను వర్ణించలేమన్నారు. హైదరాబాద్(Hyderabad) పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

New Update
Telangana: పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు: మంత్రి కేటీఆర్

Minister KTR: తెలంగాణలో పేదల అభ్యున్నతి కోసం మరిన్ని పథకాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. పేదలు, రైతుల బతులను మార్చడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని, వారిపై చూపే ప్రేమను వర్ణించలేమన్నారు. హైదరాబాద్(Hyderabad) పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో విపక్ష నేతలు ఇస్తున్న హామీలు, విమర్శలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సామాన్యులు, రైతులపై కేసీఆర్‌ కంటే ఎక్కువ ప్రేమ చూపే నేతలు దేశంలోనే ఎవరూ లేరని పేర్కొన్నారు.

ఎన్నికల సమయం కాబట్టి ఢిల్లీ, బెంగళూరు నుంచి గెస్ట్ పొలిటిషన్స్ వస్తారని, వారు చెప్పే వాటి కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను మన సీఎం కేసీఆర్ అమలు చేయాలని భావిస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. త్వరలోనే ఆ పథకాలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారని చెప్పారాయన. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకరు చేసిన పని గెలవలేక.. మరొకరు ఇంతకు ముందు ఏం చేశారో చెప్పుకోలేక.. రకరకాల మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. 'ఎన్నికల వేళ ఎవరు ఎవరో వచ్చి.. ఏదేదో చెప్పి వెళ్తుంటారు. ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి వెళ్తుంటారు. నమ్మామో నట్టేట మునుగుడు ఖాయం' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read:

Women Reservation Bill : నారీ శక్తికి జయహో…రాజ్యసభలోనూ బిల్లు పాస్.!!

India-Canada Row: మరోసారి కెనడా ప్రధాని ఆరోపణలు..భారత్ నిజనిజాలు తెలుసుకోవాలన్న ట్రూడో..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు