Khammam: ఆ నేతల్లో భయం మొదలైందా? సిటింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ షాక్ ఇవ్వనున్నారా?

తెలంగాణలో మరో 100 రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమరానికి త్వరలోనే శంఖం పూరించనుంది. ఆగస్టు నెలలో సిటింగ్ ఎమ్మెల్యేలతో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలతో ఆయన వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ గుమ్మమైనా ఖమ్మం జిల్లాలో ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయ్యారు.

Khammam: ఆ నేతల్లో భయం మొదలైందా? సిటింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ షాక్ ఇవ్వనున్నారా?
New Update

CM KCR Shocking Decision CM KCR Shocking Decision

ఆది నుంచి కమ్యూనిస్టుల అడ్డా..

ఖమ్మం జిల్లా.. తెలంగాణ రాష్ట్రానికి స్వాగత గుమ్మంగా ఉంది. ఈ జిల్లా తొలి నుంచి కమ్యూనిస్టుల అడ్డాగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గరి నుంచే ఖమ్మం గడ్డ మీద కమ్యూనిస్టులు భావాలు ఎక్కువగా ఉండేవి. మెజార్టీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా గెలిచేవారు. ఇప్పటికీ అక్కడ కమ్యూనిస్టు నాయకులకు మంచి పేరు ఉంది. అనంతరం కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవాలోనూ కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు, గెలిచారంటే ఖమ్మం జిల్లా ఓటర్లు తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల కంటే ప్రత్యేకంగా నిలిచారు.

పువ్వాడ, పొంగులేటి మధ్య విభేదాలు..

ప్రస్తుతం ఖమ్మం రెండు జిల్లాలుగా చీలింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కూడా వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీచేసి ఆయన గెలుపొందారంటే అక్కడ పొంగులేటి క్యాడర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తదానంతర పరిణామాలతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ఇటీవల జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా అయిన దగ్గరి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దాంతో కొంతకాలంగా ఆయన తరచూ పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరించారు.

టికెట్ల విషయం నాకు వదిలేయండి..

ఈ పరిణామాలతో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరింత బలం పెరిగినట్లైంది. ఇప్పటికే ఎంతో బలమైన క్యాడర్‌ ఉన్న కాంగ్రెస్‌కు పొంగులేటి తోడవ్వడంతో జిల్లాలో హస్తం పార్టీ బలోపేతంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అందులో భాగంగా శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా సిటింగ్ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని... పొంగులేటి గురించి అసలు పట్టించుకోకండని హితవు పలికారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ ప్రకటిస్తానని చెప్పినట్లు కూడా సమాచారం. పనిలో పనిగా టికెట్ల విషయంపైనా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీ పని మీరు చేయండి.. టికెట్ విషయం నేను చూసుకుంటానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, బాణోత్ హరిప్రియ, ఎమ్మెల్సీ తాతామధు ఉన్నారు. అయితే టికెట్ కచ్చితంగా ఇస్తానని చెప్పకుండా ఆ విషయం తనుకు వదిలేయండని కేసీఆర్ చెప్పడంతో వీరిలో గుబులు రేగినట్లు తెలుస్తోంది.

ఆగస్టులో అభ్యర్థుల తొలి జాబితా?

మరోవైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్‌.. ఆగస్టు నెలలో ప్రకటిస్తారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా 75 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం ఉంటుందని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పార్టీ చేసిన సర్వేల్లో చాలా మంది సిటింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు రావడంతో వారి స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిటింగ్ అభ్యర్థులను మార్చాలని అధినేత భావిస్తున్నారట. మరి ఈసారి ఎలాగైనా గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్‌ సిటింగ్ అభ్యర్థుల ఎంపిక విషయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe