CM KCR: గోస పెట్టిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలె.. నమ్మితే మళ్లీ గోస పడతం: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. సింగరేణిలో 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్‌ అంటూ ధ్వజమెతతారు. 58 ఏళ్లు గోస పెట్టిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

New Update
CM KCR: ఉద్యమకారులను కాంగ్రెస్ కాల్చి చంపింది.. కేసీఆర్ మండిపాటు!

అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) జోరు పెంచారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలపై ఆయన వాడీవేడి విమర్శలు చేస్తున్నారు. మంగళవారం చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న సీఎం.. కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. నాటి కాంగ్రెస్‌ నేతల చేతగాని తనంవల్లే సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ కూడా సింగరేణిని (Singareni) ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ‘సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం. సింగరేణి 134 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. మన అదృష్టానికి సింగరేణిని ప్రకృతి ప్రసాదించింది. తెలంగాణలో 10 కోట్ల బిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నది. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల బిలియన్‌ టన్నుల బొగ్గు కూడా వెలికి తీయలే. ఇంకా 8.5 కోట్ల బిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నది. అసుంటి సింగరేణిని మునగ గొట్టినోడు ఎవడు..? ఇది అచ్చంగా తెలంగాణ కంపెనీ. దీంట్లో ఎవరి వాటా లేకుండె. నిజాం కాలంలో పెట్టుకున్న కంపెనీ ఇది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చింది. ఆ అప్పులు తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటాను కట్టబెట్టింది. ఇంతచేసి ఇప్పుడు ఫోజులు కొట్టడానికి కాంగ్రెస్‌ పార్టీకి సిగ్గుండాలె. సింగరేణిని ఎవడమ్మిండు..? చేతగాక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్‌ పార్టీ కాదా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కాంగ్రెస్ గెలిస్తే అసలైన 24 గంటల కరెంట్.. ధరణిని మించిన యాప్‌: రేవంత్ రెడ్డి

మంథని ఈ సారి మనదే..
మంథని నియోజకవర్గంలో ఈ సారి పుట్ట మధు విజయం ఖాయమని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. మంథని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, గెలుపుపై అనుమానం పెట్టుకోవద్దని పుట్ట మధుకి సూచించారు. కొంతమంది నాయకుల్ని పక్క పార్టీల వాళ్లు కొనుక్కుపోతున్నారని పుట్ట మ‌ధు అధైర్య పడ్డారని, కానీ వారి వల్ల నష్టమేమీ జరగదని చెప్పారు కేసీఆర్. గతంలో క‌రీంనగర్ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే జరిగిందని, నాయకులు అమ్ముడుపోయినా ప్రజల్లో చైతన్యం ఉందని, పైసలకోసం వారు మోసపోరని వివరించారు. మంథనిలో కూడా అదే జరుగుతుందని భరోసా ఇచ్చారు కేసీఆర్. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి, 58 ఏళ్లు మ‌న గోస పోసుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ప్రశాంతంగా ఉన్నది గత పదేళ్లే..
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి కర్ఫ్యూలు, మతకల్లోలాలు లేకుండా ప్రశాంతమైన పాలనను అందించామని సీఎం కేసీఆర్ చెప్పారు. పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ శతాబ్ధంలోనే అత్యంత ప్రశాంతంగా తెలంగాణ ఉన్నది గత పదేళ్లే. ఒక పంచాయితీ లేదు.. ఒక లొల్లిలేదు.. అందరం మంచిగా ఉన్నాం. అందరం కలిసిమెలిసి బతుకుతున్నామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారిలేస్తే మతకల్లోలాలతో అల్లాడేది. ఎప్పుడుబడితే అప్పుడు కర్ఫ్యూ ఉండేది. ఆ పంచాయితీలకు, కర్ఫ్యూలకు కారకులు ఎవరో ఒక సారి ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజకీయాల్లో రాయి ఏదో, రత్నం ఏదో గుర్తు పట్టాలి. ప్రతీ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చాలా ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు