Telangana Elections: హుస్నాబాద్ సెంటిమెంట్.. 95-100 సీట్లలో గెలిపించండి.. ప్రజలను కోరిన సీఎం కేసీఆర్..

తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేదని, ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు సీఎం. వీటన్నింటినీ పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరారు కేసీఆర్. రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలన్నారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

New Update
Telangana Elections: హుస్నాబాద్ సెంటిమెంట్.. 95-100 సీట్లలో గెలిపించండి.. ప్రజలను కోరిన సీఎం కేసీఆర్..

CM KCR Husnabad Meeting: హుస్నాబాద్ వేదికగా బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూనే.. తమ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న పనులను వివరించారు. ఇంకా పనులు చేయాలంటే తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టామన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని, విద్యుత్ ఉత్పత్తి, తాగు, సాగు నీటి సౌకర్యం కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక విధానంలో తెలంగాణకు పోటీయే లేదన్నారు కేసీఆర్. తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేదని, ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు సీఎం. వీటన్నింటినీ పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరారు కేసీఆర్. రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలన్నారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

60 ఏళ్లలో ఏం సాధించారు..

'కొన్ని పార్టీలు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాయి. 10 సార్లు అవకాశం ఇచ్చారు.. 60 ఏళ్ల పాలనలో ఏం సాధించారు?' అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇప్పుడు చాన్స్ ఇస్తే కొత్తగా వారు చేసేది ఏముంటుందన్నారు. వారే సరిగా పని చేసి ఉంటే.. ఇన్నేళ్లలో ప్రజల బతుకులు మారేవన్నారు. 75 ఏళ్లలో పేద ప్రజల బతుకులు ఎందుకు మారలేదని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. దీనంతటికీ ఆ ఒక్క ఛాన్స్ అడుగుతున్న నేతలే కారణం అని విరుచుకుపడ్డారు. గతంలో రూ. 50, 100, 200 పెన్షన్ ఇచ్చేవారని, తమ ప్రభుత్వం వచ్చాక దానిని మొదటగా రూ. 1,000, ఆ తరువాత రూ. 2000 చేశామని వివరించారు. ఇప్పుడు మరోదఫా అధికారంలోకి వస్తే రూ. 5,000 వరకు పెన్షన్ పెంచుతామని అన్నారు కేసీఆర్. అయితే, ఈ మొత్తాన్ని దశల వారీగా పెంచడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వికలాంగులకు కూడా పెన్షన్‌ను రూ. 6 వేలకు పెంచడం జరుగుతుందన్నారు. రైతుల బాగు కోసం రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టామన్నారు. అనేక ప్రాజెక్టులను కట్టామని వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతులకు ఇస్తున్న రైతు బంధును కూడా పెంచుతబోతున్నామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

హుస్నాబాద్‌పై హామీల వర్షం..

గతంలో హుస్నాబాద్ పరిస్థితి దారుణంగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు ఉంటున్నాయన్నారు సీఎం కేసీఆర్. నాణ్యమైన విద్యుత్ అందుతోందన్నారు. నేడు హుస్నాబాద్‌లో పచ్చని పొలాలను చూస్తుంటే కడుపు నిండిందన్నారు సీఎం కేసీఆర్. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని, మిగిలిపోయిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో కాలువలను పూర్తి చేస్తామని.. దాంతో హుస్నాబాద్ రైతులకు తిరుగే ఉండదన్నారు సీఎం కేసీఆర్. ఇక గౌడవెల్లి ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని ప్రకటించారు కేసీఆర్. ప్రభుత్వం వచ్చాక.. ప్రాజెక్టును ప్రారంభించేందుకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. శనిగారం ప్రాజెక్టు కాల్వ పనులు కూడా పూర్తి చేయిస్తామన్నారు. కొత్తకొండ జాతర జరిగే వీరభద్ర స్వామి ఆలయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. రదహదారులను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ముల్కనూరులో కొత్త బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కాలేజీలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల బాగు కోరుతూ ముందుకెళ్తున్నామని, అందరికీ అందుబాటులో ఉండే సతీష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. హుస్నాబాద్ ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామన్నారు. అనంతరం వొడితెల సతీష్‌కు సభ సాక్షిగా పార్టీ బీఫాం అందజేశారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు