TSWREIS Contract Teachers Regularization: తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వీరికి టీచర్స్ డే సందర్భంగా మరిచిపోలేని కానుక ఇచ్చారు. గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అయితే, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్ట్ టీచర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెగ్యూలరైజ్ అయిన ఉపాధ్యాయులు మొత్తం 567 మంది కాగా, వీరిలో 63 మంది పురుషులు కాగా, 504 మంది స్త్రీలు ఉన్నారు.
Also Read:
PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..
Telangana CM KCR: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం