సంగారెడ్డి టు హయత్ నగర్.. మెట్రోపై సీఎం కీలక ప్రకటన

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టు హయత్‌ నగర్‌ మెట్రో మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పటాన్‌ చెరులో ఒకప్పుడు పరిశ్రమలకు కరెంట్ చాలక సమ్మెలు జరిగేవని.. కానీ, ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని తెలిపారు.

New Update
సంగారెడ్డి టు హయత్ నగర్.. మెట్రోపై సీఎం కీలక ప్రకటన

Let’s increase the wealth...Let's share it with the people...! : CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. తర్వాత, రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రూ.1000కోట్లతో దీని నిర్మాణం జరిగింది. కర్మాగారంలోని మిషన్లను పరిశీలించారు కేసీఆర్.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం తర్వాత సీఎం.. పటాన్‌ చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగిందన్న సీఎం.. జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నామని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టు హయత్‌ నగర్‌ మెట్రోకు చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్. రాష్ట్రం కాకముందు ఈ జిల్లాల్లో మంత్రిగా పని చేస్తూ పటాన్‌ చెరుకు వచ్చానని ఆనాటి విషయాలను గుర్తు చేశారు. సంగారెడ్డి అతిథిగృహంలో ఉంటూ పటాన్‌ చెరులో గల్లీగల్లీ పాదయాత్ర చేశానన్నారు. ఇంచుమించు స్థానికంగా అన్ని సమస్యలు తనకు తెలుసని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని తెలిపారు. పర్‌ క్యాపిటా ఇన్‌ కంలో దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుందని వివరించారు.

మోసపోతే.. గోసపడతామన్న సీఎం.. ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ దిశగా బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని.. హరీశ్‌ రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతోందన్నారు. కేసీఆర్‌ కిట్‌ కాదు.. మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్‌ కిట్‌ ను తీసుకువచ్చామని వివరించారు సీఎం కేసీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు