/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KCR-Thummala-Ponguleti-jpg.webp)
బీఆర్ఎస్ ను (BRS) వీడి కాంగ్రెస్ లో చేరి పోటీకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nahgeshwar Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీఎం కేసీఆర్ (CM KCR) స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఓటమి లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. వీళ్లిద్దని ఆత్మరక్షణలోకి నెట్టి వారి నియోజకవర్గాలకే పరిమితం అయ్యేలా స్కెచ్ వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అసంతృప్తులను గుర్తించి వారికి గులాబీ కండువా కప్పేలా మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో మంత్రాంగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మల్సీ తాతామధుతో ఆయన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Patel Ramesh Reddy: సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న అనుచరులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట స్థానాల్లో విజయావకాశాలను మరింత మెరుగుపరిచేలా ప్రణాళికను అధిష్టానం రూపొందిస్తున్నట్లు సమాచారం. సీఎల్పీనేత భట్టి ఇలాకా మధిరలో ప్రజాశీర్వాద సభ నిర్వహణకు సన్నద్ధ అవుతోంది బీఆర్ఎస్.
ఒకటి రెండు రోజుల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు 18, 19 తేదీల్లో రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఈ సమయంలోనే భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.