BRS Manifesto: అందరికీ రూ.5 లక్షల బీమా.. రూ.400 కే గ్యాస్ సిలిండర్: బీఆర్ఎస్ ఫుల్ మేనిఫెస్టో ఇదే!

తెలంగాణ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ సంచలన మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. ఆసరా పింఛన్లను రూ.5 వేలకు, రైతు బంధు సాయాన్ని రూ.16 వేలకు, దివ్యాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఇంకా గ్యాస్ సిలిండర్ ను రూ.400కే అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.

New Update
BRS Manifesto: అందరికీ రూ.5 లక్షల బీమా.. రూ.400 కే గ్యాస్ సిలిండర్: బీఆర్ఎస్ ఫుల్ మేనిఫెస్టో ఇదే!

తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో సంచలన మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల భీమా అందిస్తామన్నారు. ఇంకా ఆసరా పింఛన్లు, రైతు బీమా మొత్తాన్ని పెంచుతామన్నారు. కేవలం రూ.400కే రాయితీపై గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లకార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ప్రజలకు రూ.5 లక్షల బీమా అందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. "కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా" పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: సీఎం కేసీఆర్ భారీ ట్విస్ట్.. వారికి టికెట్ కట్?

ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా అందిస్తామన్నారు. రైతు బీమా తరహాలోనే ఈ స్కీమ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. ఒకే సారి కాకుండా.. ప్రతీ ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాది పూర్తయ్యే నాటికి రూ.5 వేలకు పింఛన్ పెరిగేలా చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ 'తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్' పేరిట సన్నబియ్యం అందిస్తామన్నారు. మార్చి తర్వాత రూ.3 వేలు చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం అందించే రూ.4 వేల పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. మార్చి తర్వాత ఈ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచుతామని.. దశల వారీగా ప్రతీ ఏడాది రూ.300 పెంచుకుంటూ చివరి ఏడాది నాటికి రూ.6 వేలకు చేరుకునేలా చేస్తామన్నారు. రైతుబంధు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు.

MENIFESTO - 2023 BRS

మొదటి సంవత్సరంలో రూ.12 వేలకు పెంచుతామన్నారు. తర్వాత దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామన్నారు. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. రాయితీపై నెలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. జర్నలిస్టులకు కూడా ఈ పథకాన్ని అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కడతామన్నారు. అగ్రవర్ణ పేదల కోసం ప్రతీ నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను నిర్మిస్తామన్నారు. మహిళ స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించి ఇస్తామన్నారు. అసైండ్ ల్యాండ్స్ పై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు