Telangana CM KCR: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం

జై కేసీఆర్..సీఎం కేసీఆర్ రావాలి... కేసీఆర్ కావాలి’, దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలతో పెళ్లి మండపం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్‌ ప్రముఖుల పెళ్లి ఫంక్షన్స్‌కు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ, హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జై కేసీఆర్..సీఎం కేసీఆర్ అంటూ యువకుల కేరింతలతో పెళ్లి మండపం మారుమోగింది.

Telangana CM KCR: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం
New Update

Telangana CM KCR: హైదరాబాద్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే(MLA) గంప గోవర్ధన్(Gampa Govardhan) కూమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్‌(CM KCR)హాజరయ్యారు.అయితే కేసీఆర్ ప్రముఖుల పెళ్లిలకు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి పెళ్లికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'జై కేసీఆర్ '..'సీఎం కేసీఆర్ రావాలి..కేసీఆర్ కావాలి'.. 'దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ యువకుల నినాదాలతో పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది.    సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి మద్దతు తెలిపే స్థలం, సందర్భం కాకపోయినా ఇదే అవకాశం అని అంతా భావించారు. యువకులు పెద్ద ఎత్తున కేరింతలు పెట్టడంతో పెళ్లి మండపం మారుమోగింది. దీంతో కేసీఆర్ కూడా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ వెళ్లారు.

కార్యకర్తల అసహనం...స్వాగతించిన ఎమ్మెల్యే..
మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే అందులో దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేయడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కాకుండా తాను పోటీ చేస్తున్నట్లు గులాబీ బాస్ ప్రకటించారు. ఈ క్రమంలో కామారెడ్డిలో కొంతమంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ గంప గోవర్ధనే పోటీ చేయాలని పట్టుబట్టారు. కానీ, పార్టీ గంప గోవర్ధన్‌కు ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. ఇక ఈసారి కూడా తాము అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: గొప్ప కార్యానికి వేదికైన పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం

#cm-kcr #kamareddy #telangana-cm-kcr #cm-kcr-attended-mla-gampa-govardhan-son-marriage #kcr-in-mla-gampa-govardan-sons-marriage #gampa-govardhan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe