రేపు, ఎల్లుండి సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

సీఎం జగన్ రేపు, ఎల్లుండి అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ఆయన ప‌ర్యట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

New Update
రేపు, ఎల్లుండి సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

CM Jagan Tour: రేపు, ఎల్లుండి అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ఆయన ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనున్నారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు.

Also Read: పురుషుల మొబైల్ లో దిశ యాప్ ఎందుకు? ఏదో స్కామ్ ఉందన్న లోకేష్.!

అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం.. ఆదిత్య బిర్లా యూనిట్‌ విజిట్ ఉంటుంది. ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.

10 తేది ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్‌ కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్‌ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆ జిల్లాల అధికారులు హై అలర్ట్ అవుతున్నారు. సీఎం పర్యటనకు ఏ ఇబ్బంది కలగకుండా తగిన జాగాత్రలు తీసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు