తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్..నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ

తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన పర్యటించారు. బాధితులను పరామర్శించిన జగన్ నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు.

New Update
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్..నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ

CM Jagan: మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లిన సీఎం జగన్‌ అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. తుఫాన్ బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. తుఫాన్ బాధితులను పరామర్శించిన జగన్ ప్రతి ఇంటికి రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు. అలాగే తర్వలో రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

అనంతరం..సీఎం జగన్ బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

Also Read: కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురువడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తుపాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతులు పూర్తిగా నష్టపోయారు.

ఆరుగాలం కష్టపడి, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి పండించిన పంట అమ్ముకునే సమయంలో అన్నదాతలకు అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది.  అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల టన్నుల కొద్దీ ధాన్యం నిల్వలు బలమైన ఈదురుగాలుల దాటికి చెల్లాచెదురై తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ దెబ్బకు కోలుకోవడం కష్టమేనని ధాన్యం పండించిన రైతులు బోరుమంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు