YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల

రెండో విడత రైతు భరోసా పథకం నిధులను సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పుట్టపర్తిలో విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున జమ కానున్నాయి.

New Update
YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల

వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. ఏపీలోని జగన్ సర్కార్ ప్రతీ సంవత్సరం మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున అందిస్తోంది. మొదటి విడతలో భాగంగా జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మేలో 52.57 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,942.95 కోట్లను అందించింది. ప్రస్తుతం రెండో విడతగా 53.53 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున రూ.2,204.77 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలు. మూడో విడత కింద మరో రూ.2 వేలను జనవరిలో విడుదల చేయనుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ రోజు సీఎం జగన్ పర్యటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఒక్క రైతు భరోసా స్కీమ్ కిందనే ఇప్పటివరకు రూ.33,210 కోట్లను విడుదల చేశామన్నారు. రైతుల కోసం మొత్తం రూ.1.73 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు వివరించారు. మోసాలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది చూడాలని కోరారు. మంచి జరిగితే తనకు సైనికులుగా నిలబడాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు