JAGAN: ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి.. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేవం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

New Update
JAGAN: ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి.. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేవం

JAGAN:  వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. టిక్కెట్ విషయంలో అందరూ తన నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించాలని, టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన తన మనిషి కాకుండా పోరని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో  నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

175 సీట్లకు 175 సాధ్యమే..

ఇక మనం గేర్ మార్చాల్సి అవసరం వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు అన్నారు. 175 సీట్లకు 175 సీట్లు గెలవడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయి కాబట్టే ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయన్నారు. వచ్చే రెండు నెలల్లో జగనన్న సురక్ష, ఏపీ నీడ్ వైసీపీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి..

గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలని తెలిపారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయం కాగా ఆర్గనైజేషన్‌, ప్లానింగ్‌, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయమన్నారు. అలాగే నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలని.. ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని వివరించారు. ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం..

గతంలో చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్‌ వచ్చిందని.. దాదాపు 98 లక్ష సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఆరోగ్యపరంగా ప్రతి ఇంటినీ జల్లెడపట్టి.. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తామని తెలిపారు. అనారోగ్యం ఉన్న వారికి చేయూతనిచ్చి మెరుగైన చికిత్సలు అందిస్తామన్నారు. వ్యాధి నయం అయ్యేంతవరకూ విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో వారికి చేయూతనిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తామని జగన్ వెల్లడించారు. మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో జగన్‌ పాలనపై అసదుద్దీన్‌ ఏమన్నాడంటే.!

Advertisment
తాజా కథనాలు