YS Jagan : 12: 55కు ముహూర్తం ఫిక్స్.. మరికాసేపట్లో వైసీపీ జాబితా!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయలో వైఎస్సాఆర్‌ ఘాట్ ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

New Update
YS Jagan : 12: 55కు ముహూర్తం ఫిక్స్.. మరికాసేపట్లో వైసీపీ జాబితా!

CM Jagan : ఏపీ(AP) ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) శనివారం కడప జిల్లా(Kadapa District) లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయ(Idupulapaya) లో వైఎస్సాఆర్‌ ఘాట్(YSR Ghat) ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ(YCP) అభ్యర్థులను ప్రకటించనున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఇడుపులపాయ వేదికగా అభ్యర్థులను ప్రకటించారు.

ఆ సెంటిమెంట్‌ తోనే ఈసారి కూడా ఆయన అక్కడ నుంచే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. శనివారం  తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో ఇడుపులపాయకు చేరుకుంటారు.వైసీపీ అభ్యర్థుల లిస్ట్‌ ని విడుదల చేయడానికి వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేశారు. శనివారం మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఇడుపులపాయ వేదికగా వైఎస్సాఆర్‌ ఘాట్ వద్ద నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఈ లిస్ట్‌ ను విడుదల చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

అభ్యర్థుల లిస్ట్‌ ను ప్రకటించిన తరువాత జగన్‌ ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌ కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం బయల్దేరి వస్తారు.

ఇప్పటికే వైసీపీ, ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఖరారు అయ్యింది. కొన్ని చోట్ల మాత్రమే మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. లిస్ట్‌ లో ఉన్న అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది.

Also Read : ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ.. ఏం రాశారంటే!

Advertisment
తాజా కథనాలు