CM Jagan : ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

New Update
CM Jagan : ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

CM Jagan : ప్రకాశం జిల్లా(Prakasam District) ఒంగోలు ఎన్‌(Ongole N).అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్(CM Jagan) పాల్గొని ప్రసంగించారు. ఒంగోలులో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. సభలో సీఎం మాట్లాడుతూ.. నేడు మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు.

Also Read: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి

దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల(Pedalandariki Illu) పట్టాలు ఇచ్చామని తెలిపారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామన్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని అన్నారు. వైసీపీ పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన.

Also Read : కావ్య చేష్టలకు కుళ్ళి కుళ్ళి చస్తున్న భర్త.. రాజ్ పై అనామిక మాస్టర్ స్కెచ్

గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు ఉండేవని..మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చామన్నారు. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుందని భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు.

Also Read : బిగ్‌బాస్‌ ఫేమ్ షణ్ముఖ్ కి బెయిల్! లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ వైరల్!!

రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు