AP CM Jagan: అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం నిధులను విడుదల చేశారు. రూ. 5, 060. 49 కోట్ల నగదు బదిలీ చేశారు. 45 - 60 ఏళ్ల వయసు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగానే ప్రతిపక్ష్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా వున్న చంద్రబాబు, దత్తపుత్రుడు చేసిందేమిటి అని గుర్తు చేసుకుంటే దగా, మోసమే గుర్తువస్తుందని కామెంట్స్ చేశారు. వివాహ వ్యవస్థకు కళంకం తెచ్చిన వాడు దత్తపుత్రుడని..కారును మార్చినట్టు భార్యలను మార్చేస్తాడని మండిపడ్డారు.
Also Read: ‘చేవలేక, చేతకాక..’ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ‘కరువు’ యుద్ధం!
చంద్రబాబు, పనవ్ కళ్యాణ్ 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒక్కటైన అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెప్తే అంతా మోసం మోసం మోసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, దట్టపుత్రుడికి ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తుకు వస్తారని కామెంట్స్ చేశారు. వీరిద్దరినీ నమ్మితే కాటేసే పాముని నమ్మడం, తినేసే పులిని ఇంటికీ తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి ఫొటోస్ తో ఓ పెద్ద మోసం మేనిఫెస్టో తీసుకొని వస్తారన్నారు. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తాం అంటారు.. వారి మాటలు నమ్మొద్దని హెచ్చరించారు.
Also Read: వేసవిలో నిమ్మరసం ఈ విధంగా ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు శక్తి వస్తుంది
ఈ నాలుగేళ్లలో వైఎస్ఆర్ చేయూత కింద ప్రతి అక్క, చెల్లెమ్మలకు 75,000 రూపాయల అందించామని తెలిపారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిందని..కానీ వైసీపీ ప్రభుత్వం 99.83 శాతం రికవరీతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు భూమైన ఇచ్చాడా అని ప్రశ్నించారు. మన ప్రభుత్వంలో 2 లక్షల 65 వేల కోట్ల రూపాయలు అందరి అక్కచెళ్ళమ్మల ఖాతాలోకి నేరుగా జమ అయ్యాయని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో మీ అకౌంట్లో ఒక్క రూపాయి అయినా జమ అయ్యిందా అని ప్రశ్నించారు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మహిళా సాధికారతలో నెంబర్ 1 గా నిలిచిందని వ్యాఖ్యానించారు.