Anna Canteens: నేడు ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం

అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనుంది ప్రభుత్వం.

New Update
Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం

Anna Canteens: ఏపీలో గత ఏళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలో పేదలకు న్యాయమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని 2016లో చంద్రబాబు పైలట్ ప్రాజెక్ట్ కింద అమరావతిలో ఒక అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం మరో మూడు ముఖ్య నగరాల్లో ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. ఆ తరువాత 2018లో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారు.

2014 నుండి 2018 వరకు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటిన్లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకానికి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో "ఎన్టీఆర్ అన్న క్యాంటీన్" అని పేరు పెట్టారు. దీని ద్వారా కేవలం రూ.5కే టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం.. మొత్తం మూడు పుటలు ఆహారాన్ని అందించారు, ఈ పథకాన్ని తమిళనాడులో 2011లో ఝార్ఖండ్, 2013లో తమిళనాడులో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను ఆదర్శంగా తీసుకొని ఆనాడు ఏపీకి సీఎం గా ఉన్న చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్రభుత్వం మారడంలో...

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి చెందింది. జగన్ అధ్యక్షతన వైసీపీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా టీడీపీ హయాంలో ప్రారంభించిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను మూసివేసింది. ఇందులో భారీ మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆ పథకాన్ని రద్దు చేసింది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు చేపట్టిన పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల పేరు మారుస్తూ రాజన్న క్యాంటీన్ల పేర్లతోను అధికారంలోకి వచ్చిన వైసీపీ కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది.

ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఆహార పట్టిక...

publive-image

Advertisment
తాజా కథనాలు