Chandrababu: వైసీపీ కక్షపూరిత చర్యలకు వీళ్లే ఆయుధాలు.. అయ్యన్నపై అత్యాచారం కేసు..!

2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో ప్రముఖ నేతలపై కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.

Chandrababu: వైసీపీ కక్షపూరిత చర్యలకు వీళ్లే ఆయుధాలు.. అయ్యన్నపై అత్యాచారం కేసు..!
New Update

Chandrababu: 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో టీడీపీ ప్రముఖ నేతలపై, జనసేన నాయకులపై పెట్టిన కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మొత్తం కేసులు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనే వివరాలు తెలిపారు.

చంద్రబాబుపై 17, పవన్ కళ్యాణ్ పై 7..

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందన్నారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్ కు గత ప్రభుత్వం పంపించిందని.. ఐదేళ్లూ వీఆర్ లో ఉన్న పోలీసు అధికారులూ ఉన్నారని తెలిపారు. నా మీద చిన్నప్పుడు నుంచి ఒక్క కేసు కూడా లేదని.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని అన్నారు. పవన్ రోడ్ మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారన్నారు.

ఆత్మహత్య చేసుకునేలా..

'స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారు. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారు'.

సిగ్గు చేటు..

'ప్రస్తుత హోం మంత్రి అనితపై, కొందరు ఎస్సీలపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గు చేటు. పైల్స్ ఆపరేషన్ చేయించకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలో మీటర్లు తిప్పారు. రఘురామకృష్ణం రాజును జైల్లో పెట్టి కొడుతుంటే.. ఆనాటి సీఎం ఫోన్లో చూసి ఆనందించారు. రఘు రామకృష్ణం రాజును తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వచ్చినా రఘురామ వెళ్లలేకపోయారు. నా అప్పాయింట్మెంట్ కోసం అప్పటి మంత్రి కర్రలు వేసుకొచ్చారు. నేను అమరావతి పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారు.. అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని నాటి డీజీపీ కామెంట్ చేశారు' అని అసెంబ్లీలో పేర్కొన్నారు.

#ap-cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe