Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష.. ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని కీలక ఆదేశాలు..!

గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదన్నారు సీఎం చంద్రబాబు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయాలన్నారు.

Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష.. ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని కీలక ఆదేశాలు..!
New Update

CM Chandrababu Naidu:  రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు.

అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిపిన సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సియం సమీక్షించారు.

Also Read: జగన్ పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు

2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సియం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి,అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్ లను కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్ పై సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు అరకు కాఫీ ని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈవిషయంలో సమగ్రమైన మార్పులు రావాలని గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని...దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చు అని సిఎం అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో పకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని అన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సిఎం అన్నారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాల పై కసరత్తు చేసి....రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, అలాగే గిరిజన ఉత్పత్తుల, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.

#ap-cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe