CM Chandrababu : ఏపీలో కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నేడు గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష 50 వేలు ఇవ్వాల్సింది.
కొత్తగా PMAY-U 2.0 పథకం డ్రాప్ట్ గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే ఈ గైడ్ లైన్స్ వర్తించనున్నాయి. PMAY-U 2.0 పథకం కింద రూ. 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు కోటి ఇళ్లు నిర్మాణం చేయనున్నారు. ఏపీలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు ఉండగా, ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు అదనంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి…యువకుడి మృతి!.