AP Free Bus Scheme: ఆ రోజు నుంచే ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు!

AP: తెలంగాణ మాదిరి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జులై మొదటి వారం నుంచి ఈ పథకం అమలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

AP Free Bus Scheme: ఆ రోజు నుంచే ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు!
New Update

AP Free Bus Scheme: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం పథకాన్ని అమలు (Free Bus Scheme) చేసే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.

సీఎం రేవంత్‌ను చంద్రబాబు కాపీ..

తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అనుసరించి అదే విధంగా ఏపీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విధివిధానాలను రుపొంచించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐదుగురు ప్రత్యేక అధికారులతో ఓ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

జులై 1 నుంచి..

మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పథకాన్ని జులై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read: అమరావతి పూర్తయ్యేది అప్పుడే.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!

#ap-free-bus-scheme #chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe