AP: గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త..!

గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు.

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

CM Chandrababu: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత అధికారులు సమీక్షకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు.

Also Read: రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ద్వారంపూడి బహిరంగ లేఖ..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను ఎత్తివేశారు. పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్లు సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్‍లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు తెలిపారు.

Also Read: మీకు దమ్ముంటే ఇలా చేయండి.. టీడీపీ సభ్యులకు విజయసాయి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..!

ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది.  పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నెల 23న గ్రామసభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు