CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: రాష్ట్రంలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రలకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!
New Update

AP Rains: ఏపీలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను అలెర్ట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu). అర్ధరాత్రి సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడ్డం తో ప్రమాదం పొంచివుండడంతో ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు ఇచ్చారు.

ఏపీలో 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆ గ్రామాల ప్రజల్ని పునరావస కేంద్రలకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Also Read: పీఎం మోదీకి వైఎస్ జగన్ సంచలన లేఖ

#chandrababu-naidu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి