CM Chandrababu Naidu: టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో (NTR Bhavan) ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చేశామనే అలసత్వం నేతలు వీడాలని సూచించారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయనికి తరచూ రావడం సేవగా భావించాలని అన్నారు. రోజూ ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌ఛార్జులదే అని అన్నారు.
ALSO READ: పిడుగుపాటుకు 25మంది మృతి
వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని మంత్రులంతా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేక వ్యవస్థతో పాటు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్షసాధింపులకు దిగొద్దు అని కోరారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే.. వారికీ మనకూ తేడా ఉండదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దాం అని సీఎం చెప్పారు.