CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దని.. అలా చేస్తే వైసీపీకి తమకు తేడా ఉండదని అన్నారు. By V.J Reddy 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి CM Chandrababu Naidu: టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో (NTR Bhavan) ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చేశామనే అలసత్వం నేతలు వీడాలని సూచించారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయనికి తరచూ రావడం సేవగా భావించాలని అన్నారు. రోజూ ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌ఛార్జులదే అని అన్నారు. ALSO READ: పిడుగుపాటుకు 25మంది మృతి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని మంత్రులంతా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేక వ్యవస్థతో పాటు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్షసాధింపులకు దిగొద్దు అని కోరారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే.. వారికీ మనకూ తేడా ఉండదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దాం అని సీఎం చెప్పారు. #chandrababu-naidu #ap-politics #latest-news-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి