Chandrababu: అందుకే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం.. వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు: చంద్రబాబు విజయవాడ వరదల్లో చనిపోయిన వారి కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ఇంకా బుడమేరు గండ్లు పూడ్చలేకపోయామని వివరించారు. By Jyoshna Sappogula 04 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: భారీ వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్లో వేగం పెంచామన్నారు. వందకు పైగా ఫైరింజన్లతో బురద క్లీన్ చేస్తున్నామని తెలిపారు. వర్షాల కారణంగా ఇంకా బుడమేరు గండ్లు పూడ్చలేకపోయామని వివరించారు. Also Read: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం విజయవాడలో ఇప్పటికే తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేశామని.. 2100 మంది శానిటరీ సిబ్బంది పనుల్లో ఉన్నారని తెలిపారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారని పంచే ఆహారంలో నాణ్యత కూడా చూస్తున్నామని పేర్కొన్నారు. 8 లక్షల 50 వేల వాటర్ బాటిల్స్, 3 లక్షలకు పైగా పాలప్యాకెట్లు పంచామన్నారు. 5 లక్షలకు పైగా బిస్కట్ ప్యాకెట్లు పంచామని..5 లక్షల మందికి ఆహారం పంపిణీకి సిద్ధం చేశామన్నారు. Also Read: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు! వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని, ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే పూర్తి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.#VijayawadaFloods#APGovtWithFloodVictims#AndhraPradesh — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 4, 2024 #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి