AP: తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గపోరు.. కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం..!

కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆలూరు టీడీపీ ఇంఛార్జీగా వీరభద్ర గౌడ్ వద్దంటూ మరో వర్గం టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరిని కలుపుకొని వెళ్లలేదని ఆరోపించారు.

New Update
AP: తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గపోరు.. కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం..!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 60 వాహనాల్లో కర్నూలు టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ శ్రేణులు ఆలూరు టీడీపీ ఇంఛార్జీగా వీరభద్ర గౌడ్ వద్దంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమికి అభ్యర్థి వీరభద్ర గౌడ్ కారణమని అసమ్మతి వర్గం ఆరోపించింది.

Also Read: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!

ఎన్నికల్లో ఎవరిని కలుపుకొని వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంచార్జినీ మార్చాలంటూ చిప్పగిరి, ఆలూరు  హలహర్వి,హోలగుంద, దేవనకొండ ఆస్పరి మండలాల కన్వీనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వారం క్రితమే నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు  ఆలూరు నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు