Clapping Therapy: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా!

బాగా యాంగ్జయిటీ ఫీలవుతున్నారా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి. ఆందోళన తొలగి హాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. అంతే కాదు.. క్లాప్స్ కొడితే ఆరోగ్యపరంగా ఇంకా అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

Clapping Therapy: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా!
New Update

Clapping Therapy: లాఫింగ్ థెరపీ గురించి విని ఉంటారు. మరి క్లాపింగ్ థెరపీ గురించి ఎప్పుడైనా విన్నారా! అదేమిటంటారా? ఏం లేదు.. హాయిగా చప్పట్లు కొట్టడమే! అవును, అలా చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం తప్పదు.

  • డైలీ ఎక్సర్సైజుల్లో చప్పట్లు కొట్టడాన్ని క్రమం తప్పకుండా భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రెస్ ను అధిగమించడానికి రెండు చేతులూ కలిపి చప్పట్లు చరవడం సులభమైన పరిష్కారం. అరచేతులు కలిసి చప్పట్లు కొట్టడం ద్వారా మెదడుకు పాజిటివ్ సంకేతాలు అందుతాయని పరిశోధకులు చెప్తున్నారు. అది హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది.
  • చప్పట్లు కొట్టడం రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుందంటే నమ్ముతారా! కానీ అది నిజమని నిపుణులు చెప్తున్నారు. దాంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగై గుండె సమస్యలను తగ్గిస్తుంది. చప్పట్ల ద్వారా శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయట.
  • రక్తనాళాలు, నరాల చివర్లకు కేంద్రంగా ఉన్న అరచేతులను కలుపుతూ క్లాప్స్ కొట్టడం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధితమై ఉన్న ప్రతి శరీరావయవం ఉత్తేజితమవుతుందట.
  • తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగి ఇమ్యూనిటీ మెరుగుపడుతుందని రుజువైంది.
  • చప్పట్లు కొడితే పిల్లల్లో మొమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి.
  • చప్పట్లు కొట్టడంతో జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందట.

చప్పట్లు కొట్టడానికి కూడా ఓ పద్ధతి, విధానం ఉన్నాయట! రెండు అరచేతులనూ నిటారుగా చేర్చి ఒకదానికొకటి వేళ్లు తాకే విధంగా చప్పట్లు కొట్టాలి. ఉదయం వ్యాయామం సమయంలో క్లాప్స్ కొడితే ఇంకాస్త మంచి ఫలితాలుంటాయి. లేదంటే వీలును బట్టి చేతులు కలపడమే.

ఇది కూడా చదవండి: ఈసారి కార్తిక పున్నమి ఎప్పుడొస్తుంది? ఆ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి?

#clapping-therapy #life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe