UPSC Exams On Sunday : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేతృత్వంలో సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు (Civils Preliminary Exams) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించునున్నట్లు అధికారులు వివరించారు.
పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారని అధికారులు వివరించారు. ఆ తరువాత పర్మిషన్ ఉండదు. కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని అధికారులు ముందుగానే సూచించారు.
అభ్యర్థులు అడ్మిట్ కార్డు (Admit Card) తో పాటు ఫొటో ఐడీ కార్డు (Photo ID Card) తీసుకుని రావాలని అభ్యర్థులకు సూచించారు.