ఆసియా ఖండంలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షోకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. వింగ్స్ ఇండియా(Wings India) 2024కు బేగంపేట్ ఎయిర్‌పోర్టు ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన హైదరాబాద్ నగరవాసులకు కనువిందు చేయనుంది.
1500 మంది ప్రతినిధులు:
నాలుగు రోజుల పాటు నిర్వహించే వింగ్స్ ఇండియా ఈవెంట్‌ను విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించనున్నారు. ఈ షోకు దాదాపు వంద దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. న్యూ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అనుబంధ విమానయాన సేవలు, సహాయక యూనిట్ పరిశ్రమలు, పర్యాటక రంగంలో పురోగతిని వింగ్స్ ఇండియాలో ప్రదర్శించనున్నారు.
మరోవైపు.. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో సరికొత్త వైడ్‌బాడీ బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ 777-9 ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ బాహుబలి విమానాన్ని మొదటిసారిగా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే.. బోయింగ్ 777-1 విమానం బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
ప్రతినిధులు/సందర్శకులలో ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్ ఏజెన్సీలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, పౌర విమానయాన అధికారులు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, గ్లోబల్ సీఈఓల ఫోరమ్ కీలకమైన ముఖ్యాంశాలు, పరిశ్రమ భవిష్యత్తుపై చర్చలను ప్రోత్సహిస్తాయి. ఈ ఈవెంట్ విమానయాన పరిశ్రమ తాజా పరిణామాలకు ఒక ప్రదర్శన మాత్రమే కాదు, రాబోయే సంవత్సరాల్లో దాని పథాన్ని రూపొందించడానికి బూస్ట్ లాంటిది. ఇతర ముఖ్యాంశాలలో IAF యొక్క ప్రపంచ ప్రఖ్యాత సారంగ్ బృందం ఎయిర్‌షో, ఎయిర్ ఇండియా A350 (దేశంలో ఈ రకమైన మొదటి విమానం) ఆవిష్కరణ, బోయింగ్ 777 X (దేశంలో కూడా మొదటిసారి) ప్రదర్శించడం లాంటివి ఉన్నాయి.
Also Read: నిమిషంలో 14వేల మంది రాక్షసులను శ్రీరాముడు మట్టుబెట్టిన ప్రాంతం.. ఎక్కడంటే?
WATCH: