వీడిన మంచిర్యాల మర్డర్ మిస్టరీ.. శరణ్య హత్యకు ముందు..! మంచిర్యాలలో రెండు రోజుల క్రితం సంభవించిన శరణ్య హత్యలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు నేపథ్యం అని, భర్త సుపారి ఇచ్చి ఆమెను చంపించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి RTV చేసిన పరిశోధనలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూశాయి. By Pardha Saradhi 12 Aug 2023 in ఆదిలాబాద్ New Update షేర్ చేయండి మంచిర్యాలకు చెందిన శరణ్య ఓ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం (ఆగస్టు10) డ్యూటీ ముగించి ఇంటికి వెళుతున్న ఆమెను నడిరోడ్డు మీద కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి చంపేశారు. స్థానికంగా ఈ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. కాపురంలో కలతలు శరణ్య భర్త జియా ఉల్ హక్. సీఐఎస్ఎఫ్(CISF) కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 2012లో ఇద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. మంచిర్యాల కోర్టులో వారి విడాకుల కేసు పెండింగ్ లో ఉంది. విడాకుల ఇవ్వటానికి ఆమె నిరాకరించటంతో జియా ఉల్ హక్ ఆమె హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులకు దాదాపు రూ. 10 లక్షలు సుపారి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు టీంలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదు స్పెషల్ టీంలతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. జియా ఉల్ హక్ పాత్ర నిర్ధారణ కావటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీవీ పరిశోధనలో కొత్త కోణం ఈ కేసుకు సంబంధించి ఆర్టీవీ చేసిన పరిశోధనలో ఎన్నో అంశాలు వెలుగు చూశాయి. మరో మహిళతో ఉన్నఅక్రమసంబంధం నేపథ్యంలోనే జియాఉల్ హక్ శరణ్యను వదిలించుకున్నాడని వెల్లడయ్యింది. శరణ్య, ఆ మహిళతో మాట్లాడిన ఆడియోను ఆర్టీవీ సంపాదించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి