Harsha Sai: హర్షసాయి కేసులో మరో ట్విస్ట్‌.. లీకైన ఆడియో

హర్ష సాయి కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హర్ష ఆ అమ్మాయితో మాట్లాడిన ఆడియోను బయట పెట్టాడు. మరో వైపు బాధితురాలి ఫ్రెండ్స్ హర్ష ఆమెతో ఉన్న సీసీ కెమెరా విజువల్స్‌ని బయటపెట్టారు. న్యూడ్ వీడియోలు చూపిస్తూ ఆమెను బెదిరించినట్లు ఆరోపించారు.

New Update

Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. హర్ష ఆ అమ్మాయితో మాట్లాడిన ఫోన్ కాల్ ను బయట పెట్టాడు. హర్ష దాదాపు 17నిమిషాలకు పైగా వాట్సాప్ కాల్ మాట్లాడాడు. అయితే హర్ష తాను మాట్లాడిన వాట్సాప్ కాల్ ఆడియోను మరో ఫోన్ తో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆడియోలో బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పార్ట్ ను మాత్రమే అతను విడుదల చేశాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు బాధితురాలి  ఫ్రెండ్స్ హర్ష ఆమెతో కలిసి ఉన్న సీసీ టీవీ విజువల్స్ ను బయట పెట్టారు. ఆ విజువల్స్ లో హర్ష ఆ అమ్మాయికి న్యూడ్ వీడియోలు చూపిస్తూ బెదిరించినట్లు ఫ్రెండ్స్ ఆరోపించారు. 

Also Read: రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!

హర్ష సాయి ఆడియోలో ఏముంది.. 

హర్ష సాయి బయట పెట్టిన ఆడియోలో బాధితురాలు ఇలా అన్నారు.. జీవితాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నావు.. రసికరాజు కాకుండా ఎలా ఉండగలుగుతున్నావు. ప్రేమించాలని మనసులో లేదా అని మాట్లాడింది. దానికి హర్ష సాయి అలా అని ఏమీ లేదు అని బదులిచ్చాడు. మళ్ళీ బాధితురాలు మొదలు పెట్టింది.. నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావా.. నాకేంటి ఈ గోల వయసయిపోతుంది. నేను కాకపోతే ఇంకెవరైనా ఇష్టమా చెప్పు.. నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదా..?  అని హర్షను అడిగింది. 

అసలు విషయమేంటంటే 

ఇటీవలే ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని నార్సింగ్ పోలీసు స్టేషన్‌‌లో కేసు పెట్టింది.  హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా  కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను  మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Also Read: Also Read: NTR: రండి నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ లక్ష్యం!

Advertisment
Advertisment
తాజా కథనాలు