/rtv/media/media_files/2025/10/21/wash-level-2-2025-10-21-12-28-11.jpg)
Wash Level 2
Wash Level 2: 2023లో విడుదలై ప్రేక్షకులను భయపెట్టి, జాతీయ అవార్డు గెలుచుకున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్(Horror Thriller) "వాష్" సినిమా గుర్తుందా? ఇప్పుడు దాని సీక్వెల్ "వాష్ లెవల్ 2" ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం థియేటర్లలో ఆగస్టు 27, 2025న గుజరాతీ, హిందీ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను అక్టోబర్ 22, 2025 నుంచి గుజరాతీ, హిందీ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి.
Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀
— Netflix India (@NetflixIndia) October 21, 2025
Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflixpic.twitter.com/5fIrKyBR5J
కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథలో ప్రతాప్ అనే విలన్ ని భయంకరంగా చూపిస్తారు. ఇతను చిన్నారులను, ముఖ్యంగా స్కూల్ బాలికలను మాయలోకి లాగుతాడు. హీరో అథర్వ తన కుమార్తె ఆర్యాను, మిగతా పిల్లలను రక్షించేందుకు మళ్లీ ఆ ప్రతాప్ అనే విలన్ ని ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇది కేవలం ఓ హారర్ కథ మాత్రమే కాదు, భయాన్ని, మానసిక ఒత్తిడిని, చీకటి శక్తుల గురించి చూపించే థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.
నటీనటులు
హితు కనోడియా – అథర్వ పాత్రలో
హీటెన్ కుమార్ – ప్రతాప్‌గా, విలన్ పాత్ర
జాంకీ బోడివాలా – ఆర్యా పాత్రలో
మోనాల్ గజ్జర్, చేతన్ దైయా ముఖ్య పాత్రల్లో నటించారు
సంగీతం: ఆండ్రూ స్యామ్యూయల్, ఎడిటింగ్: శివం భట్
నిర్మాణం: కల్పేష్ సోనీ, క్రునాల్ సోనీ
పంపిణీ: పనోరమా స్టూడియోస్
ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జాతీయ స్థాయిలో 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో "వాష్" సినిమాకు ఉత్తమ గుజరాతీ చిత్రంగా, అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా లభించింది.
మొత్తానికి, "వాష్ లెవల్ 2" ఓటీటీలోని ప్రేక్షకులను అలరిస్తుందా? థ్రిల్లింగ్ కథ, భయానకమైన వాతావరణం కలగలిసిన ఈ సినిమా తప్పకుండా హారర్ అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో చూసేందుకు సిద్ధంగా ఉండండి!
Follow Us