Vishnu Priya: తెలుగులో అత్యంత పాపులర్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’(Bigg Boss) ప్రస్తుతం తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సీజన్‌లో కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెస్టెంట్లతో రచ్చ రచ్చ జరుగుతుంటే, ఇప్పుడు షోలో జరుగుతున్న ఎంటర్టైన్‌మెంట్ మధ్య మాజీ కంటెస్టెంట్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
టెలివిజన్‌లో ‘పోవే పోరా’ వంటి షోలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యాంకర్ విష్ణుప్రియ, తన గ్లామరస్ లుక్స్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. కొన్ని సంవత్సరాల క్రితం బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న ఆమె, అక్కడ తోటి కంటెస్టెంట్ పృథ్వీతో ఉన్న స్నేహం, కెమిస్ట్రీ కారణంగా బాగా చర్చకు దారితీసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణుప్రియ తన బిగ్‌బాస్ అనుభవం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. “బిగ్‌బాస్ షోలో నేను డబ్బుల కోసమే పాల్గొన్నా. ఆ డబ్బుతో కొత్త ఇల్లు కట్టుకోవచ్చని అనుకున్నా కానీ అది జరగలేదు. ఇప్పటికీ నా పాత ఇంట్లోనే ఉంటున్నాను. నిజంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌లో పాల్గొనడం నా జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయం. ఆ షోలో నేను ఏమీ నేర్చుకోలేకపోయాను. మళ్లీ ఆఫర్ వచ్చినా వెళ్లను. వెళ్లినందుకు నన్నే తిట్టుకున్నా. ఎందుకు వెళ్లానా అనిపించింది. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలనిపించింది,” అని బహిరంగంగా చెప్పింది.
ఆమె ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్లు విష్ణుప్రియ నిజాయితీని ప్రశంసిస్తుండగా, మరికొందరు “ఇలాంటి విషయాలు పబ్లిక్‌గా చెప్పకూడదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయినా కూడా, విష్ణుప్రియ చెప్పిన ఈ మాటలు బిగ్‌బాస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు “ఇది షో వెనుక ఉన్న రియాలిటీ కావచ్చు” అంటుంటే, మరికొందరు ఆమెను ధైర్యంగా మాట్లాడిందని పొగిడుతున్నారు.
Vishnu Priya: బిగ్ బాస్ హౌస్‌లో కంట్రోల్ తప్పా.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ తన అనుభవంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. డబ్బుల కోసమే షోలో పాల్గొన్నానని, కానీ ఏం సాధించలేదని చెప్పింది. బిగ్‌బాస్‌లో పాల్గొనడం తన జీవితంలో పెద్ద తప్పు అని పేర్కొంది.
Vishnu Priya